భారీ అగ్నిప్రమాదం.. మెట్రో సర్వీసులకు అంతరాయం

భారీ అగ్నిప్రమాదం.. మెట్రో సర్వీసులకు అంతరాయం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కళిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమా పక సిబ్బంది, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 17 ఫైరింజన్ల సాయంతో గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఐతే, అగ్ని ప్రమాదం కారణంగా కళిందికుంజ్-జశోలా విహార్ షాహీన్ బాగ్ మధ్య మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మెట్రో మార్గం కిందనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. భారీగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది.

Tags

Next Story