ఎంత ప్రాధేయ పడినా వినకుండా తల్లి,కూతురిని

ఎంత ప్రాధేయ పడినా వినకుండా తల్లి,కూతురిని

పదివేల కోసం పసిబిడ్డను దారుణంగా హతమార్చిన ఘటన మరవక ముందే మరో దారుణం గుజరాత్‌లో చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని వడ్డీ వ్యాపారి అత్యంత కిరాతకంగా తన దగ్గర అప్పుచేసిన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. ప్రాణాలకంటే డబ్బే విలువైంది అని నిరూపించాడు. చేసింది చాలాక.. నేనే చేశాను ఈ హత్య అంటూ ఆ ఇంటి గోడ మీద రాసి మరీ వెళ్లాడు. గుజరాత్ బనస్కాంత జిల్లా కుడా గ్రామానికి చెందిన ఉకభాయ్ పటేల్ స్థానిక వడ్డీ వ్యాపారి దగ్గర రూ.21 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించలేకపోయాడు. ఇదిగో ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అంటూ తాత్సారం చేస్తుండేసరికి వడ్డీ వ్యాపారికి చిర్రెత్తుకొచ్చింది. తీసుకున్నప్పుడు తెలియదా తీర్చమనేసరికి తిప్పుకుంటావా అంటూ చాలా కోపంగా వెళ్లిపోయాడు.

ఏదో విధంగా అప్పు తీర్చేయాలని ఆ రాత్రే భార్యా భర్తలు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఉంటున్న ఇల్లు అమ్మైనా అప్పు తీర్చాలనుకున్నారు. ఇంతలోనే వడ్డీ వ్యాపారి వచ్చాడు పదునైన ఆయుధం తీసుకుని.. ఎంత ప్రాధేయ పడినా వినకుండా ఉకభాయ్‌తో పాటు అతని భార్య, కుమార్తె, కొడుకుల గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇంకా కోపం చల్లారని వడ్డీ వ్యాపారి అప్పు చెల్లించనందువల్లే ఉకభాయ్ కుటుంబసభ్యులను హతమార్చానని గోడ మీద రాసి మరీ వెళ్లాడు. శుక్రవారం రక్తపు మడుగులో పడి ఉన్న కుటుంబసభ్యులను గమనించిన ఇరుగు పొరుగు వారు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story