నలుగురు ఎంపీలు పార్టీ మారడంపై నారాలోకేష్ ట్వీట్..

నలుగురు ఎంపీలు పార్టీ మారడంపై నారాలోకేష్ ట్వీట్..

బీజేపీపై తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే పార్టీకి అండ అని గుర్తు చేశారు. నలుగురు నాయకులు వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని.. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడుతోందని నోట్‌ విడుదల చేశారు.

పార్టీ మారిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరు నేతలు స్వార్థం కోసం పార్టీ జెండాను వదిలేసినా.. భుజానికెత్తుకుని మోసే కార్యకర్తలు లక్షలాదిమంది ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీలో చేరి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని పార్టీ మారిన నేతలు చెప్పడం అవకాశవాదానికి నిదర్శనమన్నారు.

టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదని ఆయన ట్వీట్‌ చేశారు. 37ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, అనేక ఆటు పోట్లను అధిగమించిందన్నారు. ప్రజలు, కార్యకర్తలు ముందుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నడిపి పార్టీకి అండగా నిలబడి కాపాడుకున్నారన్నారు. కార్యకర్తలు, ప్రజలే తెలుగుదేశం పార్టీకి కవచాలుగా మారి కాపాడుకుంటారని ఆశాభవం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నలుగురు ఎంపీలు పార్టీ మారారని ట్వీట్‌ చేశారు మాజీ మంత్రి లోకేష్‌. గతంలోనూ టీడీపీ చచ్చిపోయిందన్నారని, కానీ టీడీపీ ఏనాడు చేతులు ఎత్తేయలేదని.. ఈ సారి తిరిగి పుంజుకుని మరింత బలపడుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు..

జాతా. పరిణామాల నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమైన టీడీపీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కుందామని...ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. క్షేత్రస్థాయి కార్యకర్తలకు సీనియర్లు ధైర్యం చెప్పాలన్నారు...

రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారని తెలియగానే చంద్రబాబు వారిని బజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా నలుగురూ వెనక్కు తగ్గలేదు. మధ్యాహ్నమే..బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై.. విదేశాల్లో ఉన్న ఆయన వెంటనే స్పందించి పార్టీ సీనియర్‌ నాయకులతో మాట్లాడారు. పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ సాయంత్రానికి టీడీపీ నేతలు కాషాయ కండువా కప్పుకుని అధినేతకు ఊహించని షాక్‌ ఇచ్చారు.

Tags

Next Story