మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దే శించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ వ్యవహరించిన తీరు వివాదం రేపింది. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా, రాహుల్ తన సెల్‌ఫోన్‌ చూడడంలో మునిగిపోయారు. నవ భారత నిర్మాణం దిశగా ముందడుగు వేద్దామంటూ రాష్ట్రపతి మాట్లాడుతుండగా రాహుల్ తన మొబైల్‌లో ఏదో చూస్తుండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ కిసాన్ మోర్చా తన ట్విటర్ ఖాతా లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది.

రాహుల్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఎలా వ్యవహరించాలో కూడా తెలీదా అంటూ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారనే స్పృహ కూడా లేకుండా మొబైల్ ఫోన్ చూడడమేంటని ప్రశ్నించారు.

Tags

Next Story