మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా

మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా

అంతా ఒకటే యోగా మంత్రం. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా. శారీరక రుగ్మతలకు సొల్యూషన్ యోగా. ఆధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగా. ఏ సమస్యయినా.. పరిష్కారం యోగానే అంటోంది ప్రపంచం. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉల్లాసంగా ఉత్సాహంగా యోగా సాధన పాల్గొంటున్నారు. .

జార్ఖండ్‌లోని రాంచీలో గల ప్రభాత్ తారా మైదానంలో నిర్వహంచనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ప్రధాని ఈరోజు రాత్రి 10:40 గంటలకు రాంచీ ఎయిర్ పోర్టు చేరుకోనున్నారు. మోదీతో పాటు యోగా చేసేందుకు ఇప్పటికే 30 వేలకు మించిన ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

గతంలో ఎన్నడూ లేనంత ఉత్సుకత.. ఈ ఏడాది పిల్లల నుంచి వృద్ధుల వరకు యోగా సాధనలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా యోగాకి ఓ రోజు కేటాయించడం.. ఐక్యరాజ్యసమితి దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడంతో యోగా డేలో పాల్గొనేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమైంది.

ఉగ్రవాదం, తీవ్రవాదం, దోపిడీలు, దొంగతనాలు హెచ్చుమీరి.. క్రైమ్ వరల్డ్ గా మారుతోంది. వీటన్నిటి నుంచి.. ప్రపంచాన్ని రక్షించగల శక్తి.. అణుబాంబులకి కాదు.. యోగాకి మాత్రమే ఉందన్న నమ్మకంతో.. యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు గురుతర బాధ్యతను భుజానికెత్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఐక్యరాజ్యసమితిలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దాన్ని UNO కూడా అత్యంత వేగంగా ఆమోదించింది. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.

Tags

Read MoreRead Less
Next Story