కోహ్లీసేన తుది జట్టులో మార్పులు?

ప్రపంచకప్‌లో టీమిండియా మరో మ్యాచ్‌కు సిధ్ధమైంది. సౌతాంప్టన్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడబోతోంది. ఇప్పటికే మూడు విజయాలతో జోరుమీదున్న కోహ్లీసేన తుది జట్టులో మార్పులు చేసే అవకాశముంది. నాలుగో స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అటు వరుస ఓటములతో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ ఎంతవరకూ పోటీ ఇస్తుందనేది డౌటే.
లీగ్ స్టేజ్ ఆరంభం నుండీ పెద్ద జట్లతో తలపడి వరుస విజయాలు సాధించిన టీమిండియాకు ఇప్పుడు చిన్న జట్లు ఎదురుకాబోతున్నాయి. తాజాగా పాక్‌పై గ్రాండ్ విక్టరీ అందుకున్న కోహ్లీసేన ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. శిఖర్ ధావన్ గాయంతో దూరమవడం ఎదురుదెబ్బగానే చెబుతున్నా... రీప్లేస్‌మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉండడంతో ఎటువంటి టెన్షన్ లేదు. అయితే తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ధావన్ స్థానంలో ఎంపికైన రిషబ్ పంత్‌తో పాటు సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ పోటీ పడుతున్నారు. అటు పేసర్ భువనేశ్వర్ గాయంతో దూరమైన నేపథ్యంలో మహ్మద్ షమీకి చోటు దక్కనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత్... మరో రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరుతుంది. అయితే ఏ టీమ్‌నూ తేలిగ్గా తీసుకునేందుకు కోహ్లీసేన సిధ్దంగా లేదు. నాకౌట్ బెర్త్ ఖరారైనా కూడా లీగ్ స్టేజ్‌ను ఘనంగా ముగించాలి టార్గెట్‌గా పెట్టుకుంది.
మరోవైపు క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్థాన్ భారత్‌కు గట్టిపోటీ ఇవ్వడమే లక్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. సంచలనాలు సృష్టించే జట్టుగా పేరున్నా... ఇప్పటి వరకూ ఆ స్థాయిలో ఆడలేదు. దీంతో భారత్‌పై కనీసం పోటీ అయినా ఇస్తుందా అనేది వేచి చూడాలి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com