వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే : మంత్రి నిర్మలా సీతారామన్

వార్షిక బడ్జెట్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలు, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల ప్రతిపాదనలపై చర్చించి.. ఒక అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్రాల్లో జీఎస్‌టీ సహా ఇతర పన్నుల వసూళ్లపై సమాలోచనలు జరిపారు.
కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే లక్ష్యాలను చేరుకోగలమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి మార్గదర్శకాలు రచించడం కేంద్రం బాధ్యత అన్న ఆమె, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పిలుపు ఇచ్చారు..
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్రం జూలై 5న లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. ఆర్థికమంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్ సమర్పించ నున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల అభిప్రాయాలను ఆమె తెలుసుకుంటున్నారు. వివిధ వర్గాలతో సమావేశమవుతూ వారి ఆలోచనలను తెలుసుకుంటున్నారు. ఈసారి కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే అవకాశం ఉంది. వేతనజీవులకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com