మహిళా ఉద్యోగిపై దాడి..

X
By - TV5 Telugu |22 Jun 2019 10:06 AM IST
టోల్‌గేట్ సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. తాజాగా గురుగ్రామ్‌లోనూ ఓ వాహనదారుడు రెచ్చిపోయాడు. టోల్ కట్టకుండా ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి... ఏకంగా మహిళ ఉద్యోగిపై దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ మహిళా ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు.. దాడి చేసిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com