ఆసక్తికరంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్

By - TV5 Telugu |22 Jun 2019 3:44 PM GMT
సౌతాంప్టన్ వేదికగా జరుగుతోన్న భారత్, ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 225 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ ఈ వికెట్ పడగొట్టాడు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో ఆప్ఘన్ బౌలర్లు సక్సెసయ్యారు. కోహ్లీ, కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ 224 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com