సచిన్, లారా రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

సచిన్, లారా రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో 104 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్, లారా పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్,లారా 453 ఇన్నింగ్స్‌లలో 20వేల రన్స్ చేస్తే... విరాట్ కేవలం 416 ఇన్నింగ్స్‌లలోనే దానిని అందుకున్నాడు. అలాగే ఈ ఘనత సాధించిన 12వ క్రికెటర్‌గానూ, మూడో భారత బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలిచాడు. భారత తరపున గతంలో సచిన్, ద్రావిడ్ మాత్రమే ఈ రికార్డు అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story