లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మంత్రి జగదీష్ రెడ్డి..

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మంత్రి జగదీష్ రెడ్డి..
X

తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ పరిశీలనకు వచ్చిన జగదీశ్‌రెడ్డి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. పంప్‌హౌజ్‌ సందర్శిస్తున్న సమయంలో జగదీశ్‌రెడ్డి వెళ్తున్న లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో మంత్రి అందులో ఇరుక్కుపోయారు. దాదాపు రెండు గంటలపాటు జగదీశ్‌రెడ్డి అందులోనే ఉండాల్సి వచ్చింది. త్వరగా అధికారులు, సిబ్బంది స్పందించి లిఫ్ట్‌ అద్దాలు పగులగొట్టి మంత్రిని సురక్షితంగా బయటకు తీశారు. తరువాత మంత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

అంతకముందు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లక్ష్మాపూర్‌ గ్రామ సమీపంలోని 8వ పంప్‌హౌజ్‌ను మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు.

Tags

Next Story