రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి
By - TV5 Telugu |22 Jun 2019 11:16 AM GMT
ఓబీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీలలో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆర్టికల్-330A, 332Aల ను సవరించి జనాభాకు తగినట్లుగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ-ఎస్టీ-మైనార్టీలకు ఉన్నట్లుగానే ఓబీసీలకు కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com