మన చావుకు మరణశాసనం.. ప్రళయం ముంచుకొస్తుందా?

మన చావుకు మరణశాసనం.. ప్రళయం ముంచుకొస్తుందా?

10 వేల సంవత్సరాల క్రితం . భూతాపం చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే పారిశ్రామీకరణ పెరిగిందో అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు మొదలయ్యాయి. మరో 12ఏండ్లలో అంటే 2030 నాటికి భూతాపం సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 12 ఏళ్లకోసారి 1.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతూ పోతాయి. అదే జరిగితే ధృవపు ప్రాంతాల్లో మంచు కరుగుతుంది. ధ్రృవపు ఎలుగుబంట్లు, వేల్స్, సీల్స్, సీ బర్డ్స్ అన్నీ చనిపోతాయి. జీవసమతుల్యం దెబ్బతింటుంది. అంతేకాదు పట్టణాల్లో నీటికొరత తీవ్రస్థాయికి చేరుతుంది. సిమ్లా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు ఇప్పటికే విపరీతమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అటు కరువు కూడా కరాళనృత్యం చేస్తుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి. అంటే భూతాపం ముప్పేట దాడి చేస్తుందన్నమాట. పెరిగే ఒక్కో డిగ్రీ ఉష్ణోగ్రత .. మన చావుకు మనం రాసుకుంటున్న మరణశాసనం కిందే లెక్క ..!

భూతాపం సముద్రతీర ప్రాంతాలకు పెనుముప్పుగా మారుతోంది. నీటిమట్టాలు పెరగడం వల్ల చిన్న చిన్న ద్వీపపు దేశాలు అంటే ఐ ల్యాండ్స్ తుడిచిపెట్టుకుపోతాయి. ప్రపంచ పటం నుంచి చాలా ఐలాండ్స్ మాయమైపోతాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇండియా, మాల్దీవులు వంటి దేశాలు ఇప్పటికే చాలా ఐల్యాండ్స్ ను కోల్పోయాయి. భూతాపం 1.5 డీగ్రీలు పెరిగితే క్రిమీకీటకాలు, మొక్కలు, చాలా రకాలైన జీవులకు ఈ భూమిపై నూకలు చెల్లినట్లే. ఇది క్రమంగా ఆహార దిగుబడిపైనా ప్రభావం చూపుతుంది. ప్రపంచమంతా ఆకలి కేకలతో అలమటిస్తుంది. ఇప్పటికే విపరీతమైన వాతావరణ మార్పుల కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి..స్పాట్...

సముద్ర మట్టాలు పెరుగుతున్నాయంటే ఉపద్రవం ముంచుకొస్తున్నట్లే లెక్క. గ్రీన్ హౌజ్ వాయువులు, భూతాపం కారణంగా మడ అడవులు కూడా పూర్తిగా తడుచిపెట్టుకుపోతున్నాయి. అదే జరిగితే తీరప్రాంతాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది...తుఫాన్లు, హరికేన్స్, సైక్లోన్స్ ముంచెత్తుతాయి. చిన్నపాటి తుఫాన్లకు కూడా విపరీతమైన ప్రాణ నష్టం జరుగుంది. దీనంతటికీ కారణం భూతాపం. పెరిగిపోతున్న భూ ఉష్ణోగ్రత. గ్రీన్ హౌజ్ వాయువులు కారణంగా వాతావరణం ఊహించని మార్పులకు లోనవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story