జోరు వర్షం... చిమ్మచీకటి.... అలాంటి సమయంలో ఓ గర్భిణీకి..

ఓ వైపు జోరు వర్షం... మరోవైపు చిమ్మచీకటి.... అలాంటి సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులొచ్చాయి. హూటాహుటిన ఆ అర్ధరాత్రి సమయంలోనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు బంధువులు. కానీ అక్కడ ఆమెను పట్టించుకునే నాథుడే లేడు. కనీసం ఏమయిందంటూ... అడిగే దిక్కే లేదు. పైగా ఇక్కడ కాన్పులు చేసే డాక్టర్లు లేరంటూ... నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అక్కడి సిబ్బంది. పెద్ద ఆసుపత్రికి వెళ్లాలంటూ వాళ్లే రెఫర్ చేస్తున్నారు. ఇదీ నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రి దయనీయ పరిస్థితి!
అర్థరాత్రి పురిటి నొప్పులు రావడంతో.... ఓ గర్భిణి ఆశావర్కర్లతో కలిసి.... ముందుగా అచ్చంపేట సర్కారు ఆసుపత్రికి వెళ్లింది. అయ్యో ఇక్కడ డాక్టర్లు లేరంటూ... సమాధానమిచ్చారు అచ్చంపేట సర్కారు దవాఖానా సిబ్బంది. అంతే కాదు... ఇక్కడికన్నా... నాగర్ కర్నూల్ ఆసుపత్రికి వెళ్లడం బెటరంటూ సలహా ఇచ్చారు. దీంతో గంటపాటు నొప్పులు భరిస్తూ.... నాగర్ కర్నూలు ఆసుపత్రి చేరిందా గర్భిణి. ఏకంగా జిల్లా ఆసుపత్రికి వచ్చినా.... మళ్లీ సేమ్ ఆన్సర్! తమ ఆసుపత్రిలో వైద్యులు లేరంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు నాగర్‌కర్నూలు ఆసుపత్రి సిబ్బంది. ఇక్కడికన్నా... మహబూబ్‌నగర్ కు వెళ్లాలంటూ ఆ గర్భిణికీ మరో ఉచిత సలహా పడేశారు.
నాగర్ కర్నూలు జిల్లా దవాఖానాలో నిత్యం ఇదే తంతు ! తమ దగ్గరికొచ్చిన గర్భిణిలనూ ... మహబూబ్‌నగర్‌కు వెళ్లాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో బాధపడేవారికి ఇది మరింత కష్టంగా మారుతోంది. ఇక రాత్రి పూట ఈ ఆసుపత్రికి వచ్చినవాళ్లకి నరకమే. వైద్యుల లేరన్న నిర్లక్ష్యపు మాటాలతో... ఆ అర్థరాత్రి ఎక్కడి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీలు. ఇలా ఒక్క రోజే ... నలుగురు గర్భిణీలకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
ఓ వైపు కేసీఆర్ కిట్లంటూ ప్రచారం ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మరోవైపు ఆశా వర్కర్లతో సర్కారు దవాఖానాలోనే ప్రసవం చేయించుకోవాలంటూ ప్రోత్సహిస్తోంది. తీరా గర్భిణిలు ఆసుపత్రికి వెళ్తే మాత్రం.... త పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుని.. నాగర్‌కర్నూలు జిల్లా ఆసుపత్రికి వైద్యులను కేటాయించాలంటున్నారు.....
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com