విజయానికి కావాల్సింది 5 పరుగులు..చేతిలో ఉన్నది ఒక వికెట్.. కానీ చివరకు..

విజయానికి కావాల్సింది 5 పరుగులు..చేతిలో ఉన్నది ఒక వికెట్.. కానీ చివరకు..

విజయానికి కావాల్సింది 5 పరుగులు..చేతిలో ఉన్నది ఒక వికెట్. కానీ సెంచరీతో చెలరేగిన విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రాత్‌వైట్ క్రీజులో ఉన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా వెస్టిండీస్ గెలుపు ఖాయమనున్నారు. విండీస్‌ టార్గెట్‌ను ఛేదిస్తుందనుకున్నారు. కానీ చివరికి ఫలితం తారుమారు అయింది. ఒక్క బాల్‌లో మ్యాచ్ గతి మారిపోయింది. సిక్స్ కోసం ట్రై చేసిన బ్రాత్‌వైట్‌ అవుట్ కావడంతో విజయం న్యూజిలాండ్‌ను వరించింది. బౌండరీ లైన్ వద్ద నీషామ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విండీస్ జట్టు ఓటమి చవిచూసింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన న్యూజిలాండ్‌ 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివిస్ బ్యాటింగ్‎లో సారథి విలియమ్సన్‌ 148 పరుగులు చేసి జట్టుకు మరోసారి వెన్నెముకగా నిలిచాడు. మరో సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్ 69 పరుగులతో రాణించడంతో కరేబియన్‌ జట్టు ముందు భారీ స్కోరును ఉంచారు. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌ నాలుగు వికెట్లు తీశాడు.

292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు ఆదిలోనే తడబడింది. గేల్ 87, షిమ్రాన్ హెట్మియర్ 54 పరుగుల మినహా అంతా తడబడ్డారు. దీంతో విండీస్ 164 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకో 3 వికెట్లు పడటం, వెస్టిండీస్‌ కథ ముగియడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సెంచరీతో 101 రన్స్‌ చేసి చెలరేగాడు. ఏ స్థితిలోనూ ఆశలు కోల్పోకుండా కివీస్‌ బౌలర్లను అద్భుత రీతిలో ఎదుర్కొన్నాడు. దాదాపుగా విండీస్‌ను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. కానీ విజయానికి 7 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి ఉండగా.. అతను సిక్సర్‌ కోసం ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌లో బౌల్ట్‌ పట్టిన క్యాచ్‌తో బ్రాత్‌వైట్‌తో పాటు విండీస్‌ కథ ముగిసింది. 286 పరుగులకు ఆలౌట్ అయింది.

6 మ్యాచ్‌లాడిన కివీస్‌కిది ఐదో గెలుపు. దీంతో దాదాపుగా కివీస్‌ జట్టు సెమీస్ కు‌ చేరినట్లే. 6 మ్యాచ్‌లాడిన విండీస్‌ నాలుగు మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒకటే నెగ్గింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ ఓటమితో కరీబియన్‌ జట్టు సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story