ఏడేళ్ల చిన్నారిపై వృద్ధ కామాంధుడు...

ఏడేళ్ల చిన్నారిపై వృద్ధ కామాంధుడు...

తెలంగాణలో చిన్నారులపై అత్యాచార ఘటనలు ఆగడం లేదు. వరంగల్‌లో 9 నెలల పిసికందును చిదిమేసిన ఘటన మరుకవ ముందే..మేడ్చల్‌లో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడో వృద్ధ కామాంధుడు. జవహర్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని బాలాజీ నగర్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారిని.. ఇంటి పక్కనే ఉంటున్న వెంకటయ్య అనే వృద్ధుడు భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు.

చిన్నారి అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితుడు వెంకటయ్య పరారయ్యాడు. అతన్ని వెంబడించి పట్టుకున్న స్థానికులు.. కరెంట్‌ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం జవహర్‌ నగర్‌ పోలీసులకు నిందితున్ని అప్పగించారు. నిందితునిపై నిర్భయ కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story