గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలసి ఫుల్లుగా తాగి..

గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలసి ఫుల్లుగా తాగి..

మరోవైపు.. హైదారాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఓ నైజీరియన్‌ మందుబాబు చుక్కలు చూపించాడు. నిన్న అర్థరాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45లో డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు పోలీసులు. ఈ మార్గంలో..... గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలసి ఫుల్లుగా తాగి కారు డ్రైవ్‌ చేస్తూ... ఓ నైజీరియన్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కాడు. అయితే..ఫుల్‌గా మందుకొట్టిన ఆ నైజీరియన్‌ నానా హంగామా చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి యత్నించాడు. కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు.

డ్రంకన్‌ డ్రైవ్‌కు సహకరించకుండా... నానా హంగామా సృష్టించిన ఇతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కారును సీజ్‌ చేశారు. గతంలోనూ ఇతను డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడి... చంచల్‌గూడా జైలుకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతన్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు...

Tags

Read MoreRead Less
Next Story