ఆస్పత్రి వెనుక కుప్పలు తెప్పలుగా అస్థిపంజరాలు

ఆస్పత్రి.. వెనుక కుప్పలు తెప్పలుగా అస్థిపంజరాలు.. ఈ వార్త నిమిషాల్లో బిహార్ రాష్ట్రమంతటా పాకింది.. సంచలనంగా మార్చేసింది.. ఓ వైపు వందల సంఖ్యలో చిన్నారుల మరణాలతో కలకలం రేగుతుంటే, ఒకేసారి వందకుపైగా అస్థిపంజరాలు కనిపించడం చర్చనీయాంశమైంది.. ఇంతకూ ఆ అస్థిపంజరాలు ఎక్కడ్నుంచి వచ్చాయి..?
దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇవన్నీ అనాథ శవాలకు సంబంధించిన అస్థిపంజరాలుగా పేర్కొన్నారు.. ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత సిబ్బంది అనాథ శవాలను ఇక్కడే ఖననం చేయడం లేదా దహనం చేయడం జరుగుతోంది.. సమీపంలో స్మశానం లేకపోవడంతో చాలాకాలంగా ఇక్కడే ఖననం చేస్తున్నారు.. ఈ అస్థిపంజరాలన్నీ దానికి సంబంధించినవేనని అధికారులు తేల్చారు..
అస్థిపంజరాల విషయం ఆనోటా ఈనోటా పడి చివరకు మీడియాకు చేరింది.. మీడియాలో కథనాలు రావడంతో జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌తోపాటు ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. వైద్యాధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది సరైన విధంగా ఖననం చేయకపోవడం వల్లే సమస్య వస్తోందని స్థానికులంటున్నారు.. సగం కాలిన శరీర భాగాలను వీధి కుక్కలు తినేవని అంటున్నారు.. తీవ్ర దుర్గంధంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు..
వరుస మరణాలతో ప్రజారోగ్యంపై అలజడి పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై అనాథ శవాల అంత్యక్రియలను దాదార్ ఘాట్‌లో నిర్వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com