టెంట్‌ కూలి 14 మంది భక్తులు మృతి.. మరో 100 మంది..

టెంట్‌ కూలి 14 మంది భక్తులు మృతి.. మరో 100 మంది..

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్‌మీర్‌ జిల్లాలో టెంట్‌ కూలి 14 మంది మృతి చెందారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం తరలివచ్చిన భక్తుల కోసం అక్కడ పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. అదే సమయంలో గాలి, భారీ వర్షం సంభవించడంతో అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో అక్కడిక్కడే పలువురు భక్తులు మృతి చెందారు.

టెంట్లు కుప్పకూలిన సమయంలో విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో మరికొంతమంది మరణించినట్లు తెలుస్తోంది. ఘటన జరగిన సమయంలో దాదాపు వెయ్యి మంది భక్తులు ఉన్నట్లు తెలస్తోంది. గాయపడిన వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

Tags

Next Story