మా జట్టు ఆటతీరు తీవ్రంగా నిరాశరపరిచింది : డుప్లెసిస్

X
By - TV5 Telugu |24 Jun 2019 5:01 PM IST
ప్రపంచకప్‌లో తమ జట్టు ఆటతీరు తీవ్రంగా నిరాశరపరిచిందని సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు. అంచనాలు పెట్టుకున్న పేసర్ రబడ విఫలమవడానికి ఐపీఎల్ కారణమంటూ డుప్లెసిస్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచకప్ ముందు విశ్రాంతి తీసుకోవాలని కోరినా.. తమ మాటలు పట్టించుకోకుండా రబడ ఐపీఎల్ ఆడాడని సఫారీ కెప్టెన్ చెప్పాడు. ఏ ఆటగాడికైనా పెద్ద టోర్నీలకు ముందు తగినంత రెస్ట్ ఉండాలని అభిప్రాయపడ్డాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com