డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంకులో 600 ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో ఐడీబీఐ బ్యాంకులో 600 ఉద్యోగాలు..

బ్యాంకులో కొలువు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికైనవారు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చదవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరిని తీసుకోరు. దానిక్కూడా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి అందులో క్వాలిఫై అయి, అక్కడి నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో సెలక్ట్ అయిన వారిని కోర్సులోకి ఎంపిక చేస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. రెండు గంటల వ్యవధిలో వీటిని పూర్తి చేయాలి. ప్రతి తప్పు జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

ప్రశ్నా పత్రంలో ఉండే అంశాలు.. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 60, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. అన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరులో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎస్) కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 9 నెలలు మణిపాల్ సంస్థలో చదువుకుంటారు. 3 నెలలు ఐడీబీఐ కార్యాలయాల్లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. కోర్సు, వసతి, భోజనం అన్నీ కలుపుకుని మొత్తం ఫీజు రూ.3.5 లక్షలు.

అవసరాన్ని బట్టి అభ్యర్థులకు ఐడీబీఐ రుణం కూడా మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తరువాత నెలసరి వాయిదాల్లో తిరిగి తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చు. కోర్సు చేస్తున్నప్పుడు ప్రతి నెలా రూ.2500 చొప్పున మొదటి 9 మాసాలు చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రతి నెలా రూ.10,000 చొప్పున చివరి మూడు నెలలు అందిస్తారు.

విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారిని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఎ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి వేతనం రూ.23,700 లభిస్తుంది. మళ్లీ డీఏ, హెచ్‌ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఉద్యోగంలో చేరిన వారు కచ్చితంగా మూడేళ్ల పాటు ఇదే బ్యాంకులో కొనసాగాల్సి ఉంటుంది. ఈలోపు మీరు వేరే ఉద్యోగం వచ్చి వెళ్లాలనుకుంటే మాత్రం రూ.2 లక్షలతో పాటు, అప్పటికే చెల్లించాల్సిన కోర్సు పీజు ఏమైనా మిగిలి పోయి ఉంటే దాన్నంతటినీ కట్టి వెళ్లాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు : 600 అర్హత: ఏదైనా డిగ్రీ వయసు: 21 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు) ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జులై 21 దరఖాస్తుకు గడువు: జులై 3 తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.700 ఇతర వివరాలకు వెబ్‌సైట్: https://www.idbibank.in

Tags

Read MoreRead Less
Next Story