పాముకి దాహం వేసిందని.. వాటర్ బాటిల్ నోటికి అందించేసరికి.. వీడియో వైరల్

పాముకి దాహం వేసిందని.. వాటర్ బాటిల్ నోటికి అందించేసరికి.. వీడియో వైరల్

వేసవి తాపాన్నుంచి ఉపశమనం కోసం గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకుంటే ప్రాణం లేచి వస్తుంది. పక్షులు, జంతువులు నీళ్ల కోసం అల్లాడుతుంటాయని అక్కడక్కడా నీళ్లు పెడుతుంటారు చాలా మంది. మరి అన్ని జంతువుల మాటేమో కాని పాముకి దాహం వేస్తే.. నిజానికి పాములకి పాలు పోస్తాం.. పక్షులకి నీళ్లు పెడతాం.. అసలు పాము దాహంతో ఉందని మనకెలా తెలుస్తుంది. దాన్ని చూస్తేనే బిక్క చచ్చిపోతాము. భయంతో పరుగులు పెడతాము. అది కూడా భయంకరమైన తాచుపాము. మరి ఆయనకు అంత ధైర్యం ఎలా వచ్చింది. దాని మనసులో భావాన్ని ఎలా గ్రహించారో ఏమో. వాటర్ బాటిల్ తీసుకొచ్చి దాని నోటి దగ్గర పెట్టి నీళ్లు తాగించేస్తున్నారు. పాము కూడా ఎంచక్కా గుటకలు వేస్తూ నీళ్ల తాగేస్తోంది. ఏదో పెంపుడు జంతువుని పెంచుకున్నంత ఆనందంగా తల నిమురుతూ నీళ్లు పట్టిస్తుంటే.. ఆయన ధైర్యానికి మెచ్చుకుంటున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అన్న విషయం తెలియరాలేదు.

Tags

Read MoreRead Less
Next Story