బహిర్భూమికి వెళ్లిన బాలిక.. అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గుడు..

బహిర్భూమికి వెళ్లిన బాలిక.. అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గుడు..

తెలంగాణలో మైనర్లపై లైంగిక అకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 ఏళ్ల గిరిజన బాలికపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ములకలపల్లి మండలం మొగరాలగుప్పకు చెందిన యువకుడు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కూలీగా మోటుగూడెంలో పనిచేస్తున్నాడు. మూడురోజులుగా బాధితురాలి గ్రామంలోనే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెళ్లిచూడగా అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. పెద్దవాళ్లను చూసి నిందితుడు పారిపోయాడు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story