ఆఫ్ఘనిస్థాన్ కాకుండా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు అదొక్కటే

ఆఫ్ఘనిస్థాన్ కాకుండా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు అదొక్కటే

భారత్‌ చేతిలో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకున్న పాకిస్తాన్‌.. సఫారీలపై తన ప్రతాపాన్ని చూపించింది.. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో విజృంభించి ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది.. తాజా ఓటమితో సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది.. అదే సమయంలో సఫారీలపై విజయంతో పాక్‌ తన సెమీస్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది.. 49 పరుగుల తేడాతో మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పాకిస్తాన్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో సెమీస్‌ రేస్‌ నుంచి నిష్క్రమించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 308 పరుగులు చేసింది. హారిస్‌ సొహైల్‌, బాబర్‌ అజామ్‌ కీలక ఇన్నింగ్‌ ఆడి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆరంభం నుంచే పాక్‌ దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు ఇమాముల్‌- ఫకర్‌ సౌతాఫ్రికా బౌలర్లకు దీటుగా సమాధానం చెప్పారు.. మధ్యలో కొంత ఒత్తిడి కనిపించినా బాబర్‌తో కలిసి సొహైల్‌ భారీ షాట్లతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు.

309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాలో మొదటి నుంచే తడబాటు కనిపించింది.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సఫారీలను ఒత్తిడిలోకి నెట్టేశారు పాక్‌ బౌలర్లు.. భారీ షాట్లకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వలేదు.. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 259 పరుగులు మాత్రమే చేయగలిగింది సౌతాఫ్రికా.. సెకండ్‌ ఓవర్‌లో ఆమిర్‌ బౌలింగ్‌లో ఆమ్లా ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత డికాక్‌-డుప్లెసిస్‌ జోడీ కుదురుకొని ఆడినా.. ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు.. కెప్టెన్‌ డుప్లెసిస్‌ డికాక్, ఫెలుక్వాయో మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. దీంతో చివరకు విజయం పాక్‌ను వరించింది. దీంతో దక్షిణాఫ్రికా ఇక సాంకేతికంగా కూడా నాకౌట్‌ రేసులో లేదు. అఫ్గానిస్థాన్‌ కాకుండా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు అదొక్కటే.

Tags

Read MoreRead Less
Next Story