తెలుగుదేశం పార్టీకి మరో షాక్..

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సమక్షంలో కమలం కడువ కప్పుకున్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న నరేంద్ర మోడీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని బీజేపీతో చేరినట్లు అంభికా కృష్ణ తెలిపారు. టీడీపీ ఓటమికి కార్యకర్తలు నాయకుల తప్పేమిలేదని అధినేత నిర్ణయాల వలనే పార్టీకి ఈపరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీలో తనకు అన్యాయమే కానీ న్యాయం జరలేదని అన్నారు.

Tags

Next Story