భార్య కోరికతో భర్త షాక్.. హోటల్ రూమ్‌లోకి అందర్నీ పిలిచి..

భార్య కోరికతో భర్త షాక్.. హోటల్ రూమ్‌లోకి అందర్నీ పిలిచి..

ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. భార్యకి బీర్ తాగే అలవాటు ఉందని తెలిసి తల పట్టుకున్నాడు. వద్దని వారించినందుకు విడాకులు కోరింది భర్తని. గుజరాత్ అహ్మదాబాద్ నిర్ణయ్ నగర్‌కు చెందిన యువకుడికి గత ఏడాది మాధాపురాకు చెందిన యువతితో వివాహమైంది. పెళ్లైన తరువాత ఎక్కడికీ వెళ్లలేదని కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాలోని బాలీకి వెళ్లారు. హోటల్‌లో దిగిన వారు పగలంతా పర్యాటక ప్రదేశాలు సందర్శించి రాత్రి మళ్లీ హోటల్ రూమ్‌కి చేరుకున్నారు. భర్తతో భార్య బీరు తాగుదామని తెప్పించమని చెప్పింది. భార్య కోరికను విని భర్త షాకయ్యాడు. నీకు మందు కొట్టే అలవాటుందని ముందే ఎందుకు చెప్పలేదన్నాడు. ఇప్పుడు మాత్రం తాగొద్దన్నాడు.

ఆయన భార్య ససేమిరా అంది. బీరు తాగాల్సిందేనని తేల్చి చెప్పింది. భర్త ఎంత చెప్పినా వినిపించుకోకపోగా.. కోపంతో హోటల్‌లో నానా గొడవ చేసింది. హోటల్ రూముల్లో ఉన్న మిగతా వారి తలుపులు బాది వారందరితో భర్త తనను బీరు తాగనివ్వడం లేదని చెప్పింది. ఇలాంటి వాడితో కలిసి ఉండడం నా వల్ల కాదు విడాకులు కావాలని అక్కడే పంచాయితీ పెట్టింది. ఆమెకు సర్థి చెప్పి అక్కడినుంచి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు భార్యా భర్తలు. ఇంటికి వచ్చిన తరువాత మూటా ముల్లె సర్దుకుని పుట్టింటికి వెళ్లి పోయింది భార్య. అక్కడి నుంచి భర్తకు విడాకుల నోటీసు పంపిస్తానని బెదిరించడంతో పాటు భరణం కింద రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story