సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లాదేశ్

సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మరో విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలిచింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 262 పరుగులు చేసింది. షకీబుల్, ముష్ఫికర్‌ రహీమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఛేజింగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. షకీబుల్ బంతితోనూ చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆప్ఘనిస్థాన్ 200 పరుగులకే ఆలౌటైంది. ఏడు మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించిన బంగ్లా సెమీస్‌ ఆశలు నిలుపుకుంది.

Tags

Next Story