రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం

రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం

సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయ 10 నుంచి పదకొండున్న వరకు వివిధ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యం, స్త్రీ శిశు సంక్షేమంపై అధికారులతో చర్చించి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తారు. మరోవైపు శాంతి భద్రతలే ప్రధాన అజెండాగా ఎస్పీలతో సమావేశం కాబోతున్నారు సీఎం. భూముల వ్యవహారం, హోంశాఖ, రవాణా, ఎక్సైజ్, మద్యపాన నిషేధం, బెల్ట్ షాపుల నిర్మూలనకు సంబంధించి అధికారులతో జగన్‌ చర్చించనున్నారు. బెల్ట్ షాపుల లేకుండా చేసేలా పలు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మహిళలపై నేరాల నియంత్రణకు సంబంధించి సీఎం సమీక్షించనున్నారు.

Tags

Next Story