కుమారుడికి సరైన వైద్యం అందివ్వలేదని.. తండ్రి ట్రాన్స్ ఫార్మర్ పైకెక్కడంతో..

X
తన కుమారుడికి సరైన వైద్యం అందివ్వడం లేదంటూ ఓ తండ్రి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి సూసైడ్ కి ప్రయత్నించడం కలకలం రేపింది. జలాలుద్దీన్ అనే వ్యక్తి... తన కొడుక్కి తీవ్ర జ్వరం రావడంతో అనంతపురం జిల్లా పెనుగొండ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించాడు. అయితే అక్కడి వైద్యులు సరిగా స్పందించలేదు. హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో జలాలుద్దీన్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కాడు. తీగలను పట్టుకొని ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ ట్రాన్స్ ఫార్మర్ ట్రిప్ అవడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
