తలారి పోస్టు కోసం పట్టపగలు, నడిరోడ్డుపై..

తలారి పోస్టు కోసం పట్టపగలు, నడిరోడ్డుపై..

తలారి పోస్టు కోసం పట్టపగలు, నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. థరూర్ మండలం ర్యాలంపాడులో ఒకే కుటుంబానికి తలారిగా అవకాశం ఉంది. తలారిని ప్రభుత్వ సిబ్బందిగా గుర్తించడంతో.. ఆ ఉద్యోగం కోసం కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ మొదలైంది. కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు.. రాజును హత్య చేశారు.

ధరూర్‌ నుంచి ఉదయం ర్యాలంపాడుకు వెళ్లిన రాజు.. ఊళ్లో అందరినీ పలకరించి రిటన్‌ అయ్యాడు. అయితే.. అదును కోసం వేచి చూస్తున్న వెంకటన్న అనే వ్యక్తి.. వేటకొడవళ్లతో ఎటాక్ చేశాడు. తలపై వేటు పడడంతో తలారి రాజు స్పాట్‌లోనే చనిపోయాడు. వెంకటన్నను పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా.. వేటకొడవలితో వారిని భయపెట్టి.. పారిపోయాడు.

పట్టపగలు.. అందరూ చూస్తుండగా హత్య జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మర్డర్‌ గురించి తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఊళ్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story