25 Jun 2019 1:11 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / అక్కడ ఆర్మీ ఆయుధాల...

అక్కడ ఆర్మీ ఆయుధాల డిపోలో పెద్ద ఎత్తున పేలుళ్లు

అక్కడ ఆర్మీ ఆయుధాల డిపోలో పెద్ద ఎత్తున పేలుళ్లు
X

కజకిస్తాన్‌ ఉత్తర కజాఖ్‌లోని ఆర్మీ ఆయుధాల డిపోలో పెద్ద ఎత్తున పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. డిపోకు సమీపంలో ఉన్న ఆరిస్‌ నగరంలోని 40 వేల మంది సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు.

మంటల కారణంగా డిపోలోని కొన్ని ఆయుధాలు పేలిపోయాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఎవరూ మృతి చెందలేదని... 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ప్రకటించారు. పేలుళ్లకు కారణాలపై ఆ దేశ రక్షణ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Next Story