ఏపీ ప్రజలపై పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీ ప్రజలపై పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోవడానికి ప్రజల్లో పోరాడే తత్వం లేకపోవడమే కారణం అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అనుకున్నది సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలకు ఉన్న పట్టుదల.. ఆకాంక్ష ఆంధ్రా ప్రజలకు లేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు దశాబ్దాల పాటు పోరాడితే.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలు మాత్రం అలాంటి పోరాటం చేయలేకపోతున్నారన్నారు.

ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదిసార్లు మాటలు మార్చినా ప్రజల నుంచి సరైన నిరసన రాలేదన్నారు పవన్‌. ప్రజల నుంచి బలమైన నిరసన రానంత వరకు హోదా విషయంలో తామేమి చేయలేమన్నారు. పవన్‌ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రత్యేక హోదా పోరాటం నుంచి తప్పుకునేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.

Tags

Next Story