ప్రజావేదిక కూల్చివేతకు రంగం సిద్ధం..

ప్రజావేదిక కూల్చివేతకు రంగం సిద్ధం..

అమరావతిలో కలెక్టర్ల సమావేశం ముగిసింది. IAS, IPS అధికారులకు తన ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు సీఎం జగన్. ఏ అంశంపై ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేశారాయన. ఈ సమావేశం ముగిసిన నేపథ్యంలో ప్రజావేదిక కూల్చివేతపై అందరి దృష్టీ నిలుస్తోంది. తాము పెట్టుకున్న సమావేశం వేదిక అవినీతి సొమ్ముతో కట్టిన, అక్రమ నిర్మాణమంటూ నిన్ననే జగన్ ప్రకటించారు. కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలు వందల్లో ఉంటాయి. వాటన్నిటినీ కూల్చివేస్తారా అనే చర్చ మొదలైంది. మరోవైపు.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు అడిగినందువల్లే.. కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మంచివి కావని అంటున్నారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణదారుల్లోను టెన్షన్‌ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు, నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు.. ప్రభుత్వం ముందుకెళ్తుందా? ప్రజా వేదిక కూల్చివేతతో ఆగుతుందా అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

Tags

Next Story