ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత‌!

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత‌!

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత‌కు సిద్ధమవుతున్నాయి. ఏకంగా 200 శాతానికి మించి ఫీజు పెంపును కాలేజీల యాజమాన్యాలు ప్రతిపాదించాయి.ఫీజుల నియంత్రణ కమిటికి చైర్మన్ లేకపోవడంతో ఈ యేడాది ఫీజులు ఇంకా నిర్ణయించలేదు..దీంతో ఆరు కాలేజీలు ఫీజులు పెంచాలని కోర్టుమెట్లెక్కాయి. అయితే షరతులతో కూడిన ప్రతిపాదనలతో కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఆరు కాలేజీలు భారీగా ఫీజులు వసూలు చేసేందుకు రెడి అయ్యాయి. మరోవైపు కోర్టుకెళ్లిన వారికి సానుకూలంగా తీర్పు రావడంతో.. మరో70 కాలేజీలు అదే బాటలో నడిచేందుకు సన్నద్ధం అవుతున్నాయి.

తెలంగాణా విద్యాశాఖ ఎంసెట్ కౌన్సెలింగ్ కి రంగం సిద్ధం చేస్తుండటంతో ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు వసూళ్లు చేసేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి తెలంగాణా అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటి మూడేళ్లకు గాను ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది.. కాని ఇప్పటివరకు టిఏఎఫ్ఆర్సీకి చైర్మన్ లేకపోవడంతో ఫీజు రెగ్యులేషన్ కూడా చేయలేని పరిస్థితి.. ఈ నేపధ్యంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల పెంచుకునేందుకు అనుమతివ్వాలని కోర్టు ను ఆశ్రయించాయి.. దీంతో కోర్టు ఫీజులు పెంచుకునేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వసూళ్లకు సన్నద్ధమయ్యాయి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రొఫేషనల్ కాలేజీలకు 2016-17 నుంచి 2018-19 విద్యాసంవత్సరం వరకూ ఫీజులను నిర్ణయించింది. దీని ప్రకారం కన్వినర్ కోటాలో 35వేల నుంచి లక్షా 13వేలు వరక ఫీజులను నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపుగా 180 ప్రైవేటు కాలేజీలున్నాయి. వాటిల్లో దాదాపుగా లక్షా మంది విద్యార్ధులు ఉంటారు. అయితే ఫీజులపై ఏఎఫ్‌ఆర్సీ గడువు ముగిసింది. దీంతో కొత్త విద్యాసంవత్సరం ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. కానీ కమిటీ చైర్మెన్‌ లేకపోవడంతో యాజమాన్యాలు నుంచి మూడేండ్ల ఆదాయ, వ్యయాల వివరాలను జనవరిలోనే ఉన్నత విద్యామండలి సేకరించింది. అయితే ప్రభుత్వం ఇప్పటికీ ఏఎఫ్‌ఆర్సీ చైర్మెన్‌ను నియమించకపోవడంతో గతంలోని ఫీజులనే కొనసాగిస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆరు ఇంజినీరింగ్‌ కాలేజీలు నిబంధనల ప్రకారం ఫీజులు పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాయి.

తెలంగాణ‌లో ఇంజ‌నీరింగ్ ఫీజుల పెంపుకు రంగం సిద్దం కాబోతుంది.ఇప్ప‌టికే ప‌లు కాలేజీలు ఫీజుల పెంపుపై కోర్టును ఆశ్ర‌యించారు.ఇదే బాట‌లో మ‌రి కొన్ని కాలేజీలు ఫీజుల మోత‌కు రంగం సిద్దం కాబోతున్నాయి.దీనిపై త‌ల్లిదండ్ర‌లతో పాటు విద్యార్ధి సంఘాలు మండి ప‌డుతుంటే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ఫీజుల‌తో తాము కాలేజీలు న‌డ‌ప‌లేమంటున్నాయి యాజ‌మాన్యాలు.

Next Story