యువరాజ్ రికార్డును 8 ఏళ్ల తరువాత బ్రేక్ చేసిన షకీబ్
వాల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఫ్గనిస్తాన్‌పై 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా పులులు వుంచిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆఫ్గనిస్తాన్ 47 ఓవర్లకే కుప్పకూలింది.. షకీబ్ అల్ హసన్ ఆల్‌రౌండ్ షో అదరగొట్టాడు.. బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లు తీసి బంగ్లా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేవ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. ఆరంభంలో తడబడ్డా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కుదురుకోవడంతో పరుగులు జోరందుకున్నాయి.. తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.. తమీమ్ ఇక్బాల్ అవుటవడంతో ముష్ఫికర్ రహీమ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.. ముష్ఫికర్ రహీమ్ 87 బంతుల్లో 83 పరుగులు చేయగా.. షకీబుల్ హసన్ 69 బంతుల్లో 51 పరుగులు చేశారు..
బంగ్లాదేశ్ నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆఫ్గనిస్తాన్ ఏమాత్రం దూకుడు చూపించలేకపోయింది.. మందకొడిగా మారిన పిచ్‌పై స్పిన్‌ను ఎదుర్కోవడంలో బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. షకీబుల్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిపోయారు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులే ఇచ్చిన షకీబల్.. 5 వికెట్లను తీశాడు. ఆఫ్గాన్ టాప్ బ్యాట్స్‌మెన్ మొత్తం షకీబుల్ బౌలింగ్‌లోనే వెనుదిరగడం విశేషం. షకీబ్‌కు ఐదు, ముస్తఫిజుర్‌కు రెండు వికెట్లు దక్కగా.. సైఫుద్దీన్, ముసద్దెక్ తలో వికెట్ తీశారు.
ఇక ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబుల్ హసన్ సరికొత్త రికార్డులు సృష్టించాడు.. వాల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ తరపున వెయ్యి పరుగులు పూర్తిచేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు.. అంతేకాదు, వాల్డ్ కప్ టోర్నీల్లో వెయ్యి పరుగులు పూర్తిచేసిన 19వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ వాల్డ్ కప్‌లో బంగ్లా తరపున ఏడు మ్యాచ్‌లు ఆడిన షకీబుల్ హసన్ 537 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. 447 పరుగులతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ నిలిచాడు. అలాగే 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసిన రికార్డును 8 ఏళ్ల తరువాత షకీబ్ బ్రేక్ చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com