ఫైనల్ గా టీపీసీసీ చీఫ్‌ ఎవరంటే..?

ఫైనల్ గా టీపీసీసీ చీఫ్‌ ఎవరంటే..?
X

టీపీసీసీ ప్రక్షాళన మొదలైంది. ఉత్తమ్‌ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్‌ రాబోతురంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నారని..వీరిలో ఒకరిని పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్‌గా ఫైనల్‌ చేసిందని వార్తలొచ్చాయి. వీటన్నిటికి చెక్‌ పెట్టారు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా.

పీసీసీ చీఫ్‌ మార్పుపై చర్చించలేదని... అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు కుంతియా. ఉత్తమ్‌ సారథ్యంలోనే పార్టీ బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

ఉత్తమే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కుంతియా చెబుతున్నా... రాష్ట్ర పార్టీకి కొత్త సారధిని నియమించాలని మాత్రం అధిష్టానం గట్టిగానే ఆలోచన చేస్తోందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికిప్పుడు అధ్యక్షుడిని మార్చకపోయినా.. మరికొన్ని రోజుల తరువాతైన సారథి మార్పు తథ్యమంటున్నారు.

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపైనా స్పందించారు కుంతియా. రాజగోపాల్ రెడ్డికి పార్టీ చాలా గౌరవం ఇచ్చిందన్న కుంతియా.. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరూ క్రమశిక్షణ తప్పినా ఉపేక్షించేది లేదన్నారాయన.

పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గోల్కొండ హోటల్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశమైంది. జరిగింది. కుంతియా, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు సమావేశమై.. తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదట రాహుల్‌ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని టీపీసీసీ కోర్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది టీపీసీసీ.

Tags

Next Story