ఆంధ్రప్రదేశ్

పోలీస్‌ స్టేషన్‌ దగ్గర వైసీపీ వర్గీయుల వీరంగం

పోలీస్‌ స్టేషన్‌ దగ్గర వైసీపీ వర్గీయుల వీరంగం
X

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీస్‌ స్టేషన్‌ దగ్గర మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజగోపాల్‌.. అతడి అనుచరులు వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ల ఫోటోల సేకరణలో భాగంగా.. ప్రస్తుత చైర్మన్ రాజగోపాల్‌కు.. జగ్గయ్యపేట ఎస్‌ఐ ఫోన్‌ చేశారు. దీంతో వీరావేశానికి లోనైన చైర్మన్‌ ఇంటూరితో పాటు అతడి అనుచరులు.. మద్యం సేవించి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హల్‌చల్‌ చేశారు.

స్టేషన్‌కు వస్తూనే అక్కడ ఉన్న పోలీసులతో మొదట అతడి అనుచరులు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌.. తన వంటిపై చొక్కా విప్పి నగ్నంగా తన ఫోటో తీయండి చూస్తానంటూ పోలీసులను అవమానించారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న పోలీసుల ఫోన్‌లు సైతం అతడి అనుచరులు లాక్కొన్ని.. బెదిరింపులకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. మున్సిపల్‌ చైర్మన్‌కు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణింగింది.

Next Story

RELATED STORIES