ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. శిక్షణా సమయంలో స్టైఫండ్ రూ. 14,500 

ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. శిక్షణా సమయంలో స్టైఫండ్ రూ. 14,500 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 27 నుంచి 30 వరకు గోవాలో జరిగే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ ర్యాలీ ద్వారా గ్రూప్-ఎక్స్ నాన్ టెక్నికల్ ట్రేడ్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్- పోలీస్, గ్రూప్ వై టెక్నికల్‌లో ఆటో టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి శిక్షణా సమయంలో రూ.14,500 స్టైఫండ్ లభిస్తుంది. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న యువకులు రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. 1999 జూన్ 2003 జనవరి మధ్య జన్మించిన వారికి అవకాశం.

అర్హత: గ్రూప్ ఎక్స్ అభ్యర్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10+2లో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. లేదా మెకానికల్ డ్రాయింగ్/సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/డ్రాప్ట్స్‌మ్యాన్‌షిప్‌లో డిప్లొమా పాస్ కావాలి.

గ్రూప్‌ వై అభ్యర్థులు 10+2 లో కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా వొకేషన్ కోర్సులో 50 శాతం మార్కులు ఉండాలి.

రిక్రూట్మెంట్ సమయంలో ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.6 నిమిషాల్లో పరిగెత్తడంతో పాటు ఫుషప్స్, సిటప్స్, స్క్వాట్స్ ఉంటాయి. ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారికి రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి. ఈ పరీక్ష పాసైన వారికి సైకలాజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇవన్నీ క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని ఎయిర్ మెన్ సెలక్షన సెంటర్‌కు శిక్షణ కోసం పంపిస్తారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో నియమిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story