చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ ఇంఛార్జ్

రెండేళ్లలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ దేవదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడిన మాజీ సీఎం ఊచలు లెక్కపెట్టే రోజు ఎంతోదూరంలో లేదన్నారు. గతంలో కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాటిని పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారన్నారు. దీనిపై లెక్కలతో సహా బయటకు తీసి కేసులు పెడతామన్నారు. ఆయన్ను జైలుకు పంపుతామన్నారు. ఏపీలో బీజేపీ సమావేశంలో సునీల్ దేవ్ ధర్ కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం హాయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. రాజధాని, మరుగుదొడ్ల పేరుతో నిధులు వచ్చినా.. వాటిని ఖర్చుచేయకుండా టీడీపీ నేతలు తినేశారన్నారు. త్వరలోనే అందరి జాతకాలు బయటపడతాయన్నారు. అవినీతిపై మోదీ ఉక్కుపాదం మోపుతున్నారని... చాలామంది నేతలకు భయం పట్టుందన్నారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని.. చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ఉన్నారన్నారు సనీల్ దేవదర్

ఏపీ బీజేపీ నేత సునీల్ దేవదర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడే కేసులు, దాడులు చేయడానికి వెనకాడలేదని... ఇప్పుడు తామె ప్రతిపక్షంలో ఉన్నామని.. వైసీపీతో కలిసి కుట్రలకు తెరతీశారంటున్నారు తమ్ముళ్లు. ఇందుకు బీజేపీ ఢిల్లీ నేతల ప్రకటనలే అద్దం పడుతున్నాయని ఆరోపించారు.

Tags

Next Story