క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే

ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఓ మున్సిపల్ అధికారిపై దాడికి తెగబడ్డాడు ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయా. క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడికి దిగాడు. నానా దుర్భాషలాడుతూ అతనిపై విరుచుపడ్డాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఓ మున్సిపల్ అధికారి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అంతే..అక్కడికి చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియా ఆ అధికారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయి సదరు అధికారిని కొట్టడం ప్రారంభించారు. అక్కడున్న వాళ్లు వారించినా వినకుండా క్రికెట్ బ్యాట్‌తో చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ అధికారి... విజయ్‌ను లంచం అడిగినందుకే ఆయన ఇలా ప్రవర్తించారని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com