వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత
వెస్టిండీస్ లెజెండ్ క్రికెటర్ బ్రియాన్ లారా ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ముంబై పరేల్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వరల్డ్ కప్ 2019 స్పోర్ట్ నెట్‌వర్క్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లారా...... మంగళవారం ఓ చర్చా కార్యక్రమం జరుగుతున్న సమయంలో... అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది..
ఇప్పటికే అతనికి ఒకసారి గుండె పోటు వచ్చి ఉండటంతో.. ఇప్పుడు రెండోసారి స్ట్రోక్ వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. ఆసుపత్రి వర్గాలు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వెస్టిండీస్ జట్టుకి సుదీర్ఘకాలం సేవలు అందించిన బ్రియాన్ లారా 2007లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత మ్యాచ్ కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు..
ప్రపంచ క్రికెట్ చరిత్రలోని లెజెండ్స్‌లో గా పేరుతెచ్చుకున్న లారా.... గత మే 2న 50వ పడిలో అడుగుపెట్టారు. 501 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఆయన పేరున ఉంది. టెస్టుల్లో తాను ఆడిన ప్రతి దేశంపైనా సెంచరీ సాధించిన క్రికెటర్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు బ్రియాన్ లారా. టెస్ట్‌మ్యాచ్‌లో 400 పరుగులు చేసిన ఏకైక క్రీడాకారుడు కూడా ఆయనే! 1990 నుంచి 2007 వరకూ వెస్టెండీస్ తరఫున 131 టెస్టులు, 299 వన్డేలు ఆడారు. 131 టెస్టుల్లో 34 సెంచరీలు, 48 అర్థశతకాలతో 11,953 పరుగులు చేశారు. 299 వన్డేల్లో లారా 10 సెంచరీలు, 63 అర్థ సెంచరీలతో 10,405 పరుగులు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com