26 Jun 2019 1:27 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / కాలిఫోర్నియాలో ఘోర...

కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం

కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం
X

అమెరికా కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బేకర్ ఫీల్డ్ ప్రాంతంలోని ఓ కారు డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందు కొన్ని కార్లలో చెలరేగిన మంటలు.. క్షణాల్లో పక్కనున్న కార్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 86 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా వ్యాపించాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై కాలిఫోర్నియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story