ఈనెల 28న జగన్, కేసీఆర్ సమావేశం.. కారణం ఏంటంటే..
By - TV5 Telugu |26 Jun 2019 1:19 AM GMT
ఈ నెల 28న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సమావేశమై చర్చలు జరుపనున్నారు. ఈ భేటీలో నీటి వివాదాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, 9,10 షెడ్యూల్ ఆస్తుల పంపిణిపై చర్చిస్తారు. ముఖ్యమంత్రుల భేటీ అనంతరం జూలై 3న ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ప్రత్యేకంగా సమావేశమై... విభజన సమస్యలపై చర్చలు జరుపుతారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com