విద్యుత్ కొనుగోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..

ఉదయం నుంచి వరుస సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆర్టీసీ విలీనంపై ఇప్పటికే సంబంధింత మంత్రి, అధికారుతో మాట్లాడిన ఆయన.. త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. అటు, విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో సమావేశంలోనూ కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. కొన్ని ఒప్పందాల్ని సమీక్షించాల్సి ఉన్నందున ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులతో మాట్లాడారు. మంత్రి బాలినేని, ఉన్నతాధికారులతో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్‌పైనా చర్చించారు. మధ్యాహ్నం తర్వాత సీఆర్‌డీఏపై సమావేశం జరగనుంది.

Tags

Next Story