ఎకరం స్థలం రూ.746 కోట్లు!!.. ఎక్కడో తెలిస్తే..

ఎకరం స్థలం రూ.746 కోట్లు!!.. ఎక్కడో తెలిస్తే..

ఆ స్థలంలో ఏమైనా బంగారు గనులున్నాయేమో.. అందుకే అంత పెట్టి కొనేస్తున్నారా ఏంటి.. పది.. ఇరవై కోట్లన్నా అర్థముంది.. మరీ రూ.746 కోట్లేమిటి. ఇంతకీ ఎక్కడ ఉందీ ఆ స్థలం. ఎవరు కొంటున్నారు అంటే.. సెంట్రల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మూడు ఎకరాల ప్లాట్‌కు రూ.2,238 కోట్లు చెల్లించేందుకు జపాన్‌కు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ సుమిటోమో సిద్ధమైంది. దేశ చరిత్రలో ఇటీవలి కాలంలో చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదే అతి పెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చంటున్నారు ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దిలీప్ కవాత్కర్. టోక్యో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుమిటోమో కార్పొరేషన్ 1919లో ఏర్పాటైంది. జపాన్, ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్టీ, మీడియా, మెటల్ ప్రొడక్ట్స్, ట్రాన్స్‌పోర్టేషన్, కన్‌స్ట్రక్షన్

సిస్టమ్స్, మినరల్స్, ఎనర్జీ, కెమికల్స్ వంటి విభాగాల్లో సేవలందిస్తోంది. దేశీ కంపెనీల్లోని ఏ ఒక్క సంస్థ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. కారణం అధిక రుణ భారం, ద్రవ్య కొరత వంటి సమస్యల వలన ప్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని ఎంఎంఆర్‌డీఏ అధికారి ఒకరు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story