తల్లి బతికుండగానే.. ముగ్గురు కొడుకులు..

ముగ్గురు కొడుకులను పెంచి పెద్ద చేసింది ఆ తల్లి.. ఉన్నత చదువులు చదివించి ఆయా రంగాల్లో ముగ్గురు కొడుకులు స్థిరపడేలా చేసింది. అలాంటి అమ్మను కాదన్నారు. తమ దగ్గర వద్దంటే వద్దు అంటూ పంతాలకు పోయారు. ఆఖరికి అవసాన దశలో కనీసం లేవలేని స్థితిలో ఉన్న తల్లిని కాదని రోడ్డున పడేశారు.
ఇదంతా నల్గొండ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో జరిగింది. వృద్దురాలు పేరు ఆండాలు.. ఆమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగి. రెండో అతను చంద్రశేఖర్.. మూడో కుమారుడు శ్రీనులు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆ ముగ్గురు మధ్య తగాదాల కారణంగా కన్నతల్లిని బతికుండగానే వదిలించుకునే ప్రయత్నం చేశారు.. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వృద్దురాలి ముగ్గురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com