ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ

భారత్-అమెరికా మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. అంతకముందే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్‌పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వీరి భేటీ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై.. ఈ నెల 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ప్రధాని మోదీ మరోసారి చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com