సీరియల్ నటి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..ఏమైంది?

సీరియల్ నటి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..ఏమైంది?

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీరియల్ నటి అదృశ్యం కలకలం రేపుతోంది. అమీర్‌పేట రాజరాజేశ్వరి ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్న నటి లలిత.. వారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. వారం నుంచి జాడ తెలియకపోవడంతో లలిత తల్లిదండ్రులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నటి లలిత కోసం గాలిస్తున్నారు.

లలిత స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం. హాస్టల్‌లో ఉంటూ గత ఏడాది నుంచి టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. ప్రేమ, కల్యాణ వైభవం, స్వర్ణ ఖడ్గం అనే సీరియల్స్‌లో లలిత నటిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు లలితను తీసుకెళ్లారని తోటి స్నేహితులు చెబుతున్నారు. హాస్టల్‌లోని తోటి సహచరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్‌ సేకరించి మిస్సింగ్ ఆధారాలను సేకరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story