మోదీ - దీదీ మధ్య మాటల యుద్ధం

మోదీ - దీదీ మధ్య మాటల యుద్ధం

ప్రధాని మోదీ - బెంగాల్‌ సీఎం దీదీకి మధ్య రాజకీయ వైరం రోజురోజుకు ముదురుతోంది. వీరిద్దరూ ఉప్పు- నిప్పుగా మారిపోయారు. బెంగాల్లో బీజేపీ పాగావేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మమత. దీంతో మోదీ - దీదీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.మోదీని టార్గెట్‌ చేస్తూ... దీదీ వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా మోదీ పాలనను పరోక్షంగా విమర్శించారు మమతబెనర్జీ. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి నాటికి 44ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా మమతా.... మోదీ ఐదేళ్ల పాలనను.... అప్పటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీతో పోల్చారు. మోదీ ఐదేళ్ల పాలన.. సూపర్ ఎమర్జెన్సీ అంటూ ట్వీట్‌ చేశారు...

1975లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది సరిగ్గా 25వతేదీనే.! దేశంలో గత ఐదేళ్ల కాలంలో సూపర్ ఎమర్జెన్సీలోనే కొనసాగింది. చరిత్ర నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు... దేశంలో ప్రజాస్వామ్య సంస్థలు బలిపశువులా మారకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారామె. కొందరు బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారుని అందులో పేర్కన్నారు..

మోడీ ప్రభుత్వ విధివిధానాలను మమత తీవ్రంగా విమర్శిస్తున్నారు. బెంగాల్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కారణంగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు మృతిచెందారు. దీంతో ఇరు పార్టీల మధ్య వైరం మరింతగా ముదిరింది. మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత.. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశం, నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరుకాలేదు.

Tags

Next Story