ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం... తాజాగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపు జేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులందరికి ఈ పథకం ద్వారా ఏటా 15 వేలు అందజేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్‌. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. క్యాంపు ఆఫీసులో జరిగిన విద్యాశాఖ సమీక్షలో డెసిషన్‌ తీసుకున్నారు సీఎం జగన్‌.

Tags

Next Story